అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. పరీక్షల కోసం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 92 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 20 వరకు పరీక్షలు జరగనున్నాయి.