అక్షరటుడే, డిచ్‌పల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతిస్తున్నట్లు తెయూ జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం వర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు సాగర్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే అందరి మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.