అక్షరటుడే, వెబ్​డెస్క్​: గల్ఫ్​ బోర్డు ఏర్పాటు చేసి వలస కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని టీజీఎండీసీ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు. దుబాయిలోని లేబర్​ క్యాంపులో రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు ఉంటున్న ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గల్ఫ్​ కార్మికులకు ఆన్​లైన్​ ఓటింగ్​ అవకాశం కల్పించాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ కోరారు. గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డులో ఉంచే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో నంగి దేవేందర్ రెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మంద భీంరెడ్డి, అదేం ప్రతాప్, సత్యం తదితరులు పాల్గొన్నారు.