అక్షరటుడే, వెబ్‌డెస్క్: గ్రూప్-2 హాల్‌టికెట్ల జారీలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 15,16 తేదీల్లో రెండు సెషన్లలో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు అధికారులకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.