అక్షరటుడే, వెబ్‌డెస్క్: దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ఆర్టీసీ 6,304 ప్రత్యేక బస్సులను నడపనుందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహాలక్ష్మీ పథకంతో పాటు పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈసారి 600 స్పెషల్ సర్వీసులను తిప్పాలని నిర్ణయించామని పేర్కొన్నారు.