అక్షరటుడే, ఇందూరు : నగరంలో ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేయాలని టీజీవీపీ నాయకులు కోరారు. శనివారం అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాకు వినతిపత్రం అందించారు. నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల, వెటర్నరీ, వ్యవసాయ కళాశాల, ఫార్మసీ తదితర విద్యాసంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీకి కూడా వినతిపత్రం ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్‌, నగర అధ్యక్షుడు అఖిల్‌, మనోజ్‌, సుజిత్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.