అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో విద్యానికేతన్ పాఠశాల 50వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రత్యేక నృత్య ప్రదర్శన, డాన్సులు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల సీఈఓ జునైత్ బహెల్మీ, ప్రిన్సిపల్ ప్రియ నాయుడు మాట్లాడుతూ.. 1974 లో తమ పాఠశాలను కవి బహెల్మీ స్థాపించారన్నారు. 30 ఎకరాల విశాలమైన స్థలంలో విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమ విద్యార్థులు ఏదో ఒక రంగంలో స్థిరపడి ఉంటారని పేర్కొన్నారు. తమ పాఠశాల ద్వారా ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దామని, డాక్టర్లు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారన్నారు. తమ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.