అక్షరటుడే, నిజాంసాగర్: పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లి హనుమాన్ ఆలయ ఆవరణలో శనివారం అఖండ హరినామ సప్తాహం ప్రారంభమైంది. విఠల్ మహారాజ్ మాట్లాడుతూ 17 ఏళ్లుగా గ్రామంలో సప్తాహం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ కాకడ హారతి, గాథ భజన, హరిపాట్, కీర్తన, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.