అక్షరటుడే, ఆర్మూర్: ఆలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభను గురువారం ఛైర్మన్ తుంబూరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు సొసైటీ జమ ఖర్చుల వివరాలను చదివి వినిపించారు. అనంతరం పలు అంశాలపై చర్చించి, తీర్మానాలకు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ ఛైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్లు సాయిరెడ్డి, ప్రమోద్, నర్సారెడ్డి, రాజు సీఈవో మల్లేష్ పాల్గొన్నారు.