అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం ప్రారంభించనున్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు.. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు.

ఎంపిక చేసిన గ్రామాలు…

ఆలూరు(మిర్దాపల్లి), ఆర్మూర్ (కోమన్ పల్లి), బాల్కొండ (జలాల్​ పూర్), భీమ్​గల్ (లింగాపూర్), బోధన్ (లంగాడాపూర్), చందూర్ (ఘన్పూర్), ధర్పల్లి (సీతయ్యపేట), డిచ్​పల్లి(కమలాపూర్), డొంకేశ్వర్ (గంగాసముందర్), ఇందల్వాయి (అన్సాన్​పల్లి), జక్రాన్​పల్లి (నారాయణపేట), కమ్మర్​పల్లి(నాగపూర్), కోటగిరి(అడ్కాస్ పల్లి), మాక్లూరు (ముల్లంగి), మెండోరా (కొడిచెర్ల), మోర్తాడ్ (డోన్​పాల్), మోస్రా (తిమ్మాపూర్), మోపాల్(నర్సింగ్ పల్లి), ముప్కాల్(వేంపల్లి), నందిపేట్(మల్లారం), నవీపేట్(సిర్నాపల్లి), నిజామాబాద్ రూరల్ (మల్కాపూర్), పోతంగల్(సోంపూర్), రెంజల్(నీలా పేపర్ మిల్), రుద్రూర్ (బొప్పాపూర్), సాలూర (తగ్గెల్లి), సిరికొండ (చిన్న వాల్గొట్), వేల్పూర్(పోచంపల్లి), వర్ని(మల్లారం), ఎడపల్లి(జైతాపూర్), ఏర్గట్ల (దోంచంద).