అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు బాలు మాట్లాడుతూ.. పీఎం మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందరికీ ఆమోదయోగమైన బడ్జెట్​ను అందజేశారన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్, ఓబీసీ మోర్చా జిల్లా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, నూతల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, కలిగొట గంగాధర్, అనిల్, సాయికుమార్, పోల్కం వేణు,పాన్ శీను, బొట్ల విజయ్, కలిగోట ప్రశాంత్, ఉదయ్, లింగం, మందుల వీరభద్రి, లింగన్న, రాములు, పోశెట్టి, దేవేందర్, అనేక్, మధు, దొండి ప్రకాశ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.