అక్షరటుడే, ఆర్మూర్: పేకాటడుతున్న ఐదుగురిని ఆర్మూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ పరిధిలోని కోమన్‌పల్లిలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.7,040 నగదు, ఐదు మొబైళ్లు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.