అక్షరటుడే, బోధన్: పట్టణంలోని మున్సిపల్ అద్దె దుకాణాల వేలానికి అధికారులు గడువు పెంచారు. గత ఫిబ్రవరిలోనే దుకాణాల అద్దె గడువు ముగియగా.. దుకాణాలు ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దుకాణాదారులు పట్టించుకోకపోవడంతో కమిషనర్ వెంకట్ నారాయణ దుకాణాలకు తాళం వేయించారు. దీంతో వారు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని సంప్రదించి గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే డిసెంబర్ వరకు అద్దె బకాయిలు చెల్లించి నడుపుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.