అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం అయ్యప్ప ఆరట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని రథంపై ఊరేగించారు. అనంతరం పెద్దచెరువు వరకు శోభాయాత్రగా వెళ్లి చక్రస్నానం నిర్వహించారు. కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ పూజారి శ్రీనివాస్, చంద్రం, హనుమంతప్ప, కృష్ణారెడ్డి, రాజేంద్రనాథ్, మాలధారులు పాల్గొన్నారు.