అక్షరటుడే, ఎల్లారెడ్డి: సదాశివనగర్ మండలకేంద్రంలో సోమవారం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్మోహన్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆలయంలో వసతుల కల్పనకు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.