అక్షరటుడే, ఎల్లారెడ్డి: పర్యావరణ పరిరక్షణ కోసం మావంతు కృషి చేస్తున్నామని అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు. లింగంపేట్‌లోని ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి సేవాసమితికి సోమవారం గురు స్వాములు 90 స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులను విరాళంగా అందజేశారు. సన్నిధానంలో ప్లాస్టిక్‌ పేపర్లు, గ్లాస్‌లను వాడకాన్ని నివారించేందుకు గురుస్వామి రవిగౌడ్‌ ప్లేట్లు, గ్లాసులు అందజేసినట్లు తెలిపారు. సన్నిధానానికి 30 కుర్చీలు అందజేసిన ముప్పిడి నగేశ్‌, 8 టేబుల్స్‌ అందజేసిన సామల చంద్రం గురుస్వామి ఇతర వస్తువులు అందజేసిన స్వాములను సన్మానించారు. కార్యక్రమంలో గురుస్వాములు సిద్దాగౌడ్‌ స్వామి, లింగాగౌడ్‌ స్వామి, సతీష్‌ స్వామి, రాజిరెడ్డి స్వామి, కేతావత్‌ రవి స్వాములు అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు.