అక్షరటుడే, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. బాస రాజేశ్వర్ ప్యానల్ – భక్తవత్సలం ప్యానల్ చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఆదివారం రాత్రి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు, 12 మంది కార్యవర్గ సభ్యుల పదవులను భక్తవత్సలం(ఢిల్లీ) ప్యానల్ క్లిన్ స్వీప్ చేసింది. గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన భక్తవత్సలం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాపూజీ వచనాలయం అభివృద్ధికి పాటు పడతామని హామీ ఇచ్చారు.