అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణలో బీసీల లెక్క తేలింది. మొత్తం జనాభాలో 55.85 శాతం ఉన్నారని కులగణన సర్వే తేల్చింది. 42 శాతం హిందూ(బీసీలు), 13.85 శాతం మైనారిటీ, ఇతరులు(బీసీలు) ఉన్నారు.
కేబినెట్ సబ్ కమిటీ చర్చ
స్థానిక ఎన్నికలకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని త్వరలోనే తేల్చనుంది. ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ ఎదుటకు కులగణన నివేదిక రానుంది. ప్లానింగ్ కమిషన్ అందించే ఈ నివేదికపై సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు, రేపు చర్చ జరుగుతుంది.
5న రాష్ట్ర కేబినెట్ సమావేశం
ఫిబ్రవరి 5న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు. ఆ వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చిస్తారు. బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణపైనా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.