అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం.. మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో ఎనిమిదో రోజు సోమవారం నాటికి 8 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఒక్క సోమవారం మధ్యాహ్నం 2 గంటలలోపు 44 లక్షల మంది భక్తులు మహాకుంభమేళాను దర్శించారు. పది లక్షల మందికి పైగా కల్పవాసీలు(గురువులు, సాధువుల వద్ద దీక్షలు తీసుకొని నిష్ఠతో ఉండే భక్తులు) పుణ్యస్నానాలు ముగించుకొని శిబిరాల నుంచి వెనుదిరిగారు.