అక్షరటుడే, వెబ్​డెస్క్: తెలంగాణలో బర్డ్​ ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం నేలపట్ల గ్రామంలో బర్డ్​ ఫ్లూ వైరస్​ నిర్ధారణ అయింది. ఇటీవల గ్రామంలోని కోళ్ల ఫామ్​లో కోళ్లు చనిపోయాయి. వాటి నమూనాలను అధికారులు ల్యాబ్​కు పంపగా బర్డ్​ ఫ్లూగా తేలింది. దీంతో స్థానిక ప్రజల్లో భయం మొదలైంది. మరోవైపు వైరస్ భయంతో ఇప్పటికే చాలా చోట్ల చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి.