అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఏనుగు దయానంద్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్కాల్ భూదేవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలుగు టైటాన్స్ కోచ్ జగన్మోహన్ ప్రారంభించారు. అంతకు ముందు క్రీడాకారుల మధ్య దయానంద్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు రమేష్, రిటైర్డ్ పీఈటీలు ఉమామహేశ్వరరావు, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.