అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం 29 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పర్వేశ్ సింగ్ వర్మ, కాల్ఖాజీ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం అతిషిపై రమేశ్ బిదూరి పోటీ చేయనున్నారు.