Advertisement
అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి పెద్ద చెరువులో శుక్రవారం సాయంత్రం గల్లంతైన సాయికుమార్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం పోలీసులు వెలికితీశారు. పట్టణంలోని ఆర్బీ నగర్‌కు చెందిన సాయికుమార్ తన తండ్రితో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం మృతదేహం పైకి తేలడంతో పోలీసులు ఒడ్డుకు చేర్చారు.
Advertisement