అక్షరటుడే, ఇందూరు: నగరంలోని ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మ ఆలయ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, రెంజర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.