అక్షరటుడే, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. మంగళవారం కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన రోజుకీ ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగపడిందన్నారు. రెండ్రోజుల నుంచి కళ్లు తెరిచి చూస్తున్నాడని, కానీ మమ్మల్ని గుర్తు పట్టడం లేదన్నారు. పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమని వైద్యులు తెలిపారని చెప్పారు.