అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ రాష్టానికి IIM(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్) ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. లోక్ సభలో ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ సమాధానం చెబుతూ వివరణ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో చాలా కేంద్ర విద్యాసంస్థలు ఉండడంతో ఐఐఎం మంజూరు చేయలేమని స్పష్టం చేశారు.