అక్షరటుడే, వెబ్డెస్క్ : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 18వ విడత కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లుగా సంబంధిత పీఎం కిసాన్ వెబ్సైట్లో పేర్కొంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6వేలు అందజేస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తారు.