అక్షరటుడే, వెబ్డెస్క్: ఈపీఎఫ్–95 పథకం కింద పెన్షన్ అందుకుంటున్న చందాదారుల డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈపీఎఫ్ కింద చెల్లించే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈపీఎఫ్–95 ఆందోళన కమిటీ శనివారం ఈ విషయాలను వెల్లడించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో జరిపిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా 78 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం కలుగనుంది.