అక్షరటుడే, వెబ్డెస్క్ : గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తంగా 139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించారు. వారిలో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఏపీకి చెందిన నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (కళలు)కి పద్మ భూషణ్, తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్రెడ్డి (వైద్యం)కి పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. అలాగే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ దక్కింది.