అక్షరటుడే, వెబ్​డెస్క్​: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో ఈ సారి బీహార్​ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆ రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబర్​లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఆ రాష్ట్రంలో కేంద్ర మఖానా బోర్డు, జాతీయ ఆహార ఉత్పత్తి సంస్థ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఆ రాష్ట్రంలోని మిథిలాంచల్​ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటుకు ప్రతిపాదించింది.