అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశంలో కొత్త స్మార్ట్ సిటీలను ప్రకటించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో కేంద్రమంత్రి తోకాన్ సాహు రాతపూర్వకంగా పేర్కొన్నారు. గతంలో కేంద్రం వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసి పలు అభివృద్ధి పనుల కోసం భారీగా నిధులు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలను కూడా స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేయాలనే డిమాండ్ ఉంది. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ స్కీం కింద ఎంపిక చేయాలని భారాస, కాంగ్రెస్ నాయకులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటనతో ఎంపిక లేనట్లేనని తెలుస్తోంది.