అక్షరటుడే, వెబ్ డెస్క్: ఓటీటీ ప్లాట్ ఫారాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఎలాంటి హెచ్చరిక లేకుండా ఓటీటీలో కంటెంట్ ప్రసారం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇలాంటి చర్యలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.