అక్షర టుడే జుక్కల్: పోతిరెడ్డిపల్లి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఆదివారం చండీ హోమ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దుర్గామాతకు కుంకుమార్చన అభిషేకాలు చేశారు. అనంతరం అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండప నిర్వాహకులు తేజ స్వామి, సురేష్ శర్మ, తిమ్మారెడ్డికి చెందిన నరసింహారెడ్డి, లక్ష్మికాంత్ రెడ్డి సునీత, సుదర్శన్ రెడ్డి లక్ష్మి, ఊడుగుల శ్రీకాంత్, విగ్రహదాత పెద్దకొడగల్ కు చెందిన శివప్రసాద్ , భక్తులు పాల్గొన్నారు.