అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యాచక వృత్తిని సమూలంగా రూపుమాపేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సిటీ కఠినచర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా సిటీలో భిక్షాటనను పూర్తిగా నిషేధించింది. భిక్షాటన చేసేవారికి డబ్బులిచ్చే వారిపై ఏకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా నగరాన్ని యాచకులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఇండోర్‌ కలెక్టర్‌ ఆశిశ్‌సింగ్‌ పేర్కొన్నారు. భిక్షాటన చేస్తున్నవారికి పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ఆయన తెలిపారు. 2025 జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమలు చేస్తామన్నారు.