అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నగరంలోని గీతాంజలి పాఠశాలను శిథిలావస్థకు చేరిన భవనంలో నిర్వహిస్తున్నారని, సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా పాఠశాల నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.