అక్షరటుడే, ఇందూరు: ఓడినవారు నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో ఉత్తమ ప్రదర్శనలను ఇవ్వాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. విద్యార్థులు తమ ఆలోచన శక్తితో సైబర్ క్రైమ్ ను కూడా నివారించే ప్రయోగాలు చేయాలన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభతో నూతన ఆవిష్కరణలను రూపొందించాలని సూచించారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు, అలాగే జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, సైన్స్ అధికారి గంగాకిషన్, కాంతారావు, ఆయా ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

శివమణి(మాణిక్ భవన్), స్ఫూర్తి(సోషల్ వెల్ఫేర్ స్కూల్), రోహన్ రెడ్డి(వీపీఎస్), పూజ(కలిగోట, జడ్పీహెచ్ఎస్), రిషిత్ (వన్నెల్ జడ్పీహెచ్ఎస్), అంజలి (టీఎస్ మోడల్ స్కూల్), వైష్ణవి(చిట్టాపూర్ జడ్పీహెచ్ఎస్), నాగలక్ష్మి (లక్ష్మాపూర్, జడ్పీహెచ్ఎస్), కళ్యాణి (కోటగిరి కేజీబీవీ), రమ్య(తిర్మన్ పల్లి, జడ్పీహెచ్ఎస్), మీనాక్షి (కుకునూరు, జడ్పీహెచ్ఎస్), ఇందుప్రియ(లిటిల్ ఫ్లవర్ స్కూల్), సుశాంత్ (సత్యశోధక్ పాఠశాల సిరికొండ).