అక్షరటుడే, బోధన్: సీఎం కప్ పోటీలు నవీపేట్ మండల కేంద్రంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో పోటీలను పీడీ అబ్బాపూర్ రవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో క్రీడాకారులకు అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. జట్లను ఎంపిక చేసి జిల్లాస్థాయికి పంపనున్నారు.