అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడలు గురువారం ముగిశాయి. గెలుపొందిన క్రీడాకారులకు అడిషనల్ కమిషనర్ శంకర్, జిల్లా యువజన, క్రీడల అధికారి ముత్తెన్న బహుమతులను అందజేశారు. గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు సాయరెడ్డి, ఆర్వీజీ గౌడ్, పీఈటీ లు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.