అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ లో నిర్వహించిన సీఎం కప్ మండలస్థాయి క్రీడలు గురువారం ముగిశాయి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పురుషులు విభాగంలో గెలుపొందిన జట్లకు తహశీల్దార్ రమేశ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో నరేందర్, కార్యదర్శి రాజలింగం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు విజయ్, వీడీసీ అధ్యక్షుడు ముత్యం, పీడీ రాజేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.