అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయం ఆవరణలో మంగళవారం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. పోటీలకు ఎంపీడీవో గంగాధర్, తహశీల్దార్ భిక్షపతి, ఎస్సై శివకుమార్, ఎంఈవోలు అమర్ సింగ్, తిరుపతిరెడ్డి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో నవోదయ పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ మను యొహనాన్ తదితరులు పాల్గొన్నారు.