అక్షర టుడే, నిజామాబాద్‌ రూరల్‌ : ఘన్‌పూర్‌లో ఆదివాసీ నాయక్‌పోడ్‌ సంఘ భవన నిర్మాణానికి రూ.10లక్షలు కేటాయించాలని సంఘ నాయకులు కోరారు. మంగళవారం రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో కలిసి విన్నవించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సీడీపీ నిధులు రాగానే కేటాయిస్తానని హామీఇచ్చారు. అలాగే కల్యాణ మండపంలో వంటశాల, మూత్రశాలలు నిర్మించాలని, డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని ఆయన్ను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పోలసాని శ్రీనివాస్, షాదుల్ల, రామకృష్ణ, లింబాద్రి, హరీష్‌ పటేల్, బాజేందర్, దేవేందర్, నాయకపోడ్‌ మండల నాయకులు సాయినాథ్, గంగాధర్, శేఖర్, మోహన్, సాయిలు, బాలయ్య, సభ్యులు పాల్గొన్నారు.