అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్ కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుపట్టారు. కానీ కేవలం బడ్జెట్ పై మాత్రమే మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి కోరారు. దీంతో మేయర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. మేయర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. మేయర్ పై కాగితాలు చించి వేసి నిరసన చేపట్టారు. దీంతో సభ గందరగోళంగా మారింది. బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ సభ్యులు సైతం ఆందోళన చేశారు. ఈ గందరగోళం మధ్య మేయర్ సభను వాయిదా వేశారు.