అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ముంబై అంధేరి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి ఆర్జీవీపై చెక్ బౌన్స్ కేసు వేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మూడు నెలల జైలు శిక్షతో పాటు ఫిర్యాదుదారునికి రూ.3.72 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.