అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో హోటల్ తెరిచి ఉంచిన యజమానికి ఒక రోజు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాబన్ సాహెబ్ పహాడ్‌కు చెందిన అబ్దుల్ హఫీ అర్ధరాత్రి వరకు టీ పాయింట్ తెరిచి ఉంచగా.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా.. ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు.