అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో నలుగురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. నవీపేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కెతావత్ సంతోష్, షేక్ జైనుద్దీన్, విస్లావత్ శివరాం, తోకల సంజీవ్ మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.