అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నగరంలోని పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌లో వెల్‌నెస్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నీ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ బస్వారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం విన్నర్‌ టీం (తెయూ, డిచ్‌పల్లి), రన్నరప్‌ టీం (చాణక్య డిగ్రీ కళాశాల,నిర్మల్‌)కు బహుమతులు అందజేశారు. అలాగే వెల్‌నెస్‌ హాస్పిటల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బోదు అశోక్‌ కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు విపుల్‌ గౌడ్, నార్త్‌ ఎంఆర్‌ఓ నాగార్జున, క్లస్టర్‌ హెడ్‌ భార్గవ్, జీఎం రాజేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.