అక్షర టుడే, వెబ్ డెస్క్: నోకియాతో బిలియన్ డాలర్ల మార్కెట్ పొడిగింపు ఒప్పందంపై ఎయిర్ టెల్ సంతకం చేసింది. దేశంలోని అనేక నగరాల్లో 4జీ, 5జీ సేవలు విస్తరించేందుకు, కనెక్టివిటీ సేవలు మెరుగుపడేందుకు ఈ ఒప్పందం దోహద పడనుంది.
అధునాత పరికరాల ఇన్స్టాలేషన్
ఒప్పందం ప్రకారం.. ఎంపిక చేసిన నగరాల్లో కొత్తగా అధునాతన పరికరాలను నోకియా అమర్చనుంది. బేస్‌బ్యాండ్ యూనిట్లు, బేస్ స్టేషన్‌లు, తాజా తరం భారీ ఎంఐఎంవో రేడియోలతో సహా 5G ఎయిర్‌స్కేల్ పరికరాలను సమర్థవంతమైన రీఫ్‌షార్క్ సిస్టమ్-ఆన్-చిప్ సాంకేతికత ద్వారా అమర్చుతారు.
ఉద్గారాల తగ్గింపు..
అధునాత పరికరాల బిగింపులో రేడియేషన్ ప్రభావం ఉండకుండా, ఉద్గారాలను తగ్గించేలా నోకియా చర్యలు తీసుకోనుంది. ఒప్పందంలో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు ప్రతినిధులు వెల్లడించారు.
ఏఐ ఆధారిత పర్యవేక్షణ..
నెట్వర్కింగ్, కనెక్టివిటీ, నిర్వహణను ఏఐ ఆధారంగా పర్యవేక్షించే ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం మంతా రే నెట్వర్క్ ను ఉపయోగించాలని భావిస్తున్నారు.