అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్రంపై అప్పుల భారం రోజురోజుకు పెరుగుతూ పోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. కేవలం 13 నెలల్లోనే రేవంత్ సర్కారు చేసిన అప్పు అక్షరాలా రూ.1,46,918 కోట్లు. అంటే రోజుకు రూ.345 కోట్లు అన్నమాట. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టకుండా, ఒక్క పథకం పూర్తిగా అమలు చేయకుండా.. ఈ స్థాయిలో అప్పులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుడతున్నాయి. కాగా.. గత బీఆర్ఎస్ సర్కారు పదేళ్లలో అప్పు రూపంలో ప్రజలపై మోపిన భారం రూ. 6,71,756 కోట్లు.