అక్షరటుడే, ఆర్మూర్: దీన్‌దయాల్ స్పర్శ యోజన రాష్ట్రస్థాయి జనరల్ నాలెడ్జ్ పోటీల్లో ముగ్గురు విజేతలకు రూ.6 వేల చొప్పున నగదు జమ చేశామని ఆర్మూర్ పోస్ట్‌మాస్టర్ కిషన్‌నాయక్ తెలిపారు. ఇటీవల తపాలా శాఖ ఆధ్వర్యంలో జనరల్ నాలెడ్జ్ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షకు 360 మంది విద్యార్థులు హాజరయ్యారని.. అందులో ముగ్గురు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేశామని చెప్పారు.