అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 5న పోలింగ్ జరుగనుంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోటీ యాభై లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా బరిలోకి దిగాయి. మరోసారి అధికారాన్ని అందుకోవాలని ఆప్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీలో ఆప్ పాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాగా.. 8న ఫలితాలు విడుదల కానున్నాయి.